ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం

మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 05

విద్యారంగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన పలువురు ఉపాధ్యాయులను కీసరిలో ఘనంగా సత్కరించారు. మండల విద్యాశాఖ అధికారి జమదగ్ని మరియు జిల్లా పరిషత్ హైస్కూల్ కీసర కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వంగేటి రాంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు సన్మానం అందుకున్నారు.

ఈ అవార్డులు పొందినవారిలో జిల్లా పరిషత్ హైస్కూల్ చీర్యాల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఎస్.ఏ గణిత శాస్త్రం చంద్రారెడ్డి, ఎస్.ఏ తెలుగు బిక్షపతి, ఎస్.జి.టి. సంతోషమ్మ, ఎస్.జి.టి. శశిరేఖ, ఎస్.జి.టి. అనురాధ ఉన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, “ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు, జీవితాలను మార్చే శిల్పి” అని పేర్కొన్నారు. ఇలాంటి ప్రతిభావంతుల కృషి, అంకితభావం భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దడంలో కీలకం అని వారు అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment