సిద్దిపేట/గజ్వేల్, జూలై 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారత జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య చిత్రాన్ని అవాలతో అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు పట్టణానికి చెందిన శ్రీరామకోటి. భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జాతీయ జెండా రూపకల్పనతో ప్రజల్లో దేశభక్తిని, జాతీయ భావాన్ని రగిలించి, తెలుగు వారి ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటరన్నారు. జాతీయోద్యమంలో కీలక పాత్ర వహించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పింగళి వెంకయ్య అని అన్నారు.