రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్
దేశంలో రైస్ మిల్లర్ల సమస్యలు తెలుసుకుని, ఆ సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్ జోషి ఈయాప్ ను ఆవిష్కరించారు. గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉండే ఈ యాప్ ను రైస్ మిల్లర్లు డౌన్లోడ్ చేసుకుని అందులో తమ సమస్యలను నమోదు చేయొచ్చు.ఆహారధాన్యాల సేకరణ, పంపిణీకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ఒక నోడల్ ఏజెన్సీగాపనిచేస్తోందన్నారు.