ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మలోత్ సొమేశ్వర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జిల్లా కేంద్రం కొత్తగూడెంలో రమాదేవి అధ్యక్షతన జిల్లా ప్రధాన నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘం భద్రాద్రి జిల్లా అద్యక్షులు, ప్రధాన కార్యదర్శి – శ్రీను, రవి కుమార్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు బాణోత్ సక్రం కొనసాగించారు.
ప్రధాన సమస్యలు:-
1.మహిళలు ప్రసూతి సెలవులు ఇప్పించుట, 2. ఈ విద్యా సంవత్సరం మినీమ్ టైమ్ స్కేల్ సాదించుట, 3. 61 సంవత్సరం ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ప్రయత్నం చేయుట, 4. అందరికి రెగ్యువర్ అయ్యే విధంగా ప్రయత్నం చేయుట పై సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలనీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కోరారు. ఈ సమావేశాన్ని ముఖ్య అతిథిగా కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మలోత్ సొమేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా ఉపాధ్యాయురాల సమస్యలను, ఉపాధ్యాయుల సమస్యలను గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ దృష్టికి తీసుకెళ్తాను అని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు – పొదేం రవీందర్ , బాబురావు హరిరాం, సరేష్, రాందాస్, శ్రీను ట్రెజరీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటిడిఎ ఇంచార్జి రాజేష్ బాలాజి కమల వెంకటేశ్వర్లు, రాంబాబు, సునిత, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశ వేదికను ఏర్పాటు చేసినా గుగులోత్ రూప్ల కి మరియు సమావేశ సమయంలో అల్పాహారం ఏర్పాటు చేసినా బాబురావు, రమాదేవి రాంబాబు, రవి కుమార్, రాజేష్, బాలాజీ, అందరికి పేరు పేరునా హృదపూర్వక అభినందనలు తెలియజేశారు.