ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఏరియా ఎస్ ఓ టూ జిఎం డి శ్యాంసుందర్ కి వినతిపత్రం అందజేసిన సోలార్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు
సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ప్రత్యేక ప్రోత్సాహకం ఐదు వేల రూపాయలు బోనస్ చెల్లించాలని కోరుతూ గురువారం నాడు
ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో మణుగూరు సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ కాంటాక్ట్ కార్మికులు ఏరియా ఎస్ ఓ టూ జిఎం డి శ్యాంసుందర్ కి, ఏరియా ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్ గారికి వినతి పత్రాలు అందజేశారు . ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు ఏరియా అధ్యక్షులు ఆంగోత్ మంగీలాల్ మాట్లాడారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఈ దసరా పండుగ ప్రత్యేకతను చాటుకుందని కారణం సింగరేణి అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వార్షిక లాభాలలో వాటా ప్రత్యేక ప్రోత్సాహక నజరానగా చెల్లింపు నిర్ణయం అని ఐ ఎఫ్ టి యు గా మేము కూడా హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. అయితే సింగరేణి అనుబంధ సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులను ఇందులో భాగస్వాములు చేయకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని. సింగరేణి వార్షిక లాభాలలో సోలార్ విద్యుత్ ద్వారా వస్తున్న లాభాలు కూడా ఉన్నాయన్నది జగతిత్వమే వారి అసంతృప్తిని గుర్తించి సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకు, టెక్నీషియన్లకు కూడా ఐదువేల రూపాయలు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతిని అందించే విధంగా మీ ద్వారా వారి అభ్యర్థనను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించి దిశగా తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో చల్లా కాంతారావు,ఈ వెంకటేశ్వర్లు, ఎం కృష్ణ, ది దేవేందర్, టెక్నీషియన్స్,ఐ సతీష్,,ఈశ్వర్ సాయి తదితరులు పాల్గొన్నారు.