పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
గజ్వేల్ సెప్టెంబర్ 01 ప్రశ్న ఆయుధం :
గజ్వేల్ మండలం ఆహ్మదిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988 – 1989 సంవత్సరం లో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం గజ్వేల్ పట్టణంలోని ఓ బ్యాంకెట్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పాఠాలు బోధించిన ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.అలాగే పూర్వ విద్యార్థులు చిన్ననాటి మధుర స్మృతులు నెమరు వేసుకుంటూ సంతోషంగా గడిపారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటూ అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 35 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ వీర ప్రతాప్ గౌడ్, రిటైర్డ్ ఉపాధ్యాయులు మంగ శంకర్ గౌడ్, వెంకట్ గౌడ్, మల్లేశం, రిటైర్డ్ పిఈటీ సలామాన్, పూర్వ విద్యార్థులు అత్తెల్లి రవీందర్, కరుణాకర్ రెడ్డి, పొన్నాల రవీందర్ రెడ్డి ,మద్ది అంజిరెడ్డి, ఎస్ ముత్యం రెడ్డి, ఎన్. రవికుమార్, వి. శ్రీనివాస్, ఎస్. మధు, ఎన్. వెంకటేశం, రాజేశ్వర్, జె. శ్రీనివాస్, సంధ్యారాణి ,ఎన్. జ్యోతి, పద్మ, నాగమణి ,సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కుకునూరు పల్లి సెయింట్ ఆన్స్ స్కూల్ కరస్పాండెంట్ చంటి వ్యవహరించారు.