పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): చౌటకుర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2009-2010 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఆరు నుంచి పదో తరగతి వరకు చదివిన విద్యార్థులు 14 ఏళ్ల తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక్కచోట కలుసుకుని ఒకరికొకరు పరిచయం చేసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదివిన బడి, పరిసరాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిల్లో ఉన్నామని తెలిపారు. గురువులు కలిసి ఆట పాటలతో విద్యార్థులు, గురువులు సందడి చేశారు. ఈ సదర్భంగా తమకు పాఠాలు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment