Site icon PRASHNA AYUDHAM

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

IMG 20250105 WA0023

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

2001 -02 ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన విద్యార్థులు 

22 ఏళ్ల తర్వాత కలవడం ఆనందంగా ఉంది 

 

ప్రతి ఒక్కరి జీవితంలొ స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. ఆనందం, బాల్యం, స్మృతులు, కరచాలనాలు, చెమ్మగిల్లిన కళ్ళతో అలింగనాలు గురువుల మందలింపులు తలుచుకుంటూ ఒకసారి వయస్సు మరచి పోయి చిన్న పిల్లల కేరింతలతో గౌరారం హిల్ 7 రిసార్ట్ లో కోలాహలంగా మారింది. ఈ ప్రాంగణంలో అడుగు పెడుతూనే హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజ్ఞాపూర్ పాఠశాలలో 2001-02 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండుగగా మారింది.

రెండు దశబ్దాల తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిన వారు కొందరు, ఎక్కడెక్కడో స్థిర పడిన వారు కొందరు, ఉద్యోగాల్లో కొందరు, సహదర్మచరినిలుగా కొందరు, వివిధ స్తితుల్లో జీవిస్తూ తమ మిత్రులను కలవాలనే కలంపులో ఆనాటి విద్యార్థులైన కొంత మంది విద్యార్థులకు ఆలోచన కలిగింది. ఈ సమ్మేళనంలో తమ గురువుల బోధనలు తమ కుటుంబ పరిస్థితులు నాటి చిలిపి చేష్టలను క్రమశిక్షణ పేరుతో గురువుల దండనలు తలుచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు . వచ్చిన పూర్వ సమ్మేళనం రిసార్ట్స్ ఆవరణలో పొద్దు పోయే వరకు గడిపి నువ్వు స్కూల్లో తిన్న బెత్తం దెబ్బలు, తాము చేసిన అల్లరి ఇప్పుడూ తమ జీవితం లో ఎదుర్కొంటున్న విషయం తెలిపారు బరువెక్కిన హృదయాలతో ఎవరి గమ్య స్థానాలకు వారు కదిలారు. ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు యూసుఫ్ ఖాన్ నరసయ్య , లక్ష్మణస్వామి , రామ్ రెడ్డి , కేశవరెడ్డి, కాశీనాథ్ విజయలక్ష్మి తమ అనుభవాలను చెప్పగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version