Site icon PRASHNA AYUDHAM

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

WhatsApp Image 2025 01 12 at 5.14.44 PM

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

సిద్దిపేట జిల్లా, 12 జనవరి 2025 :  జన్మనిచ్చిన తల్లిదండ్రులను చదువు నేర్పిన గురువులను విద్యాలయాలను జీవితంలో ఎప్పటికీ కూడా మరువకూడదని కొండపాక ఎంఈఓ. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొండపాక మండలం దుద్దెడ ఉన్నత పాఠశాలలో2010- 2011 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం దుద్దడలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు గురువులను సత్కరించారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమ్మేళన సమావేశంలో ఎంఈఓ శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ చదువుకున్న పాఠశాలకు ఏదో ఒక రకంగా అండగా నిలవాలన్నారు. చదువు నేర్పిన బడిని మరవకూడదన్నారు.అప్పుడు ఈ పాఠశాలలో టీచర్లుగా ఉన్నవారు మాధవ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి ప్రస్తుతం ఎంఈఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు ఉపాధ్యాయులు తిరుపతి, ప్రసాద్, హనుమాన్ దాస్ లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version