పూర్వ విద్యార్థిని-విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థిని-విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం

ప్రశ్న ఆయుధం,జులై 28 శేరిలింగంపల్లి,ప్రతినిధి

సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1988-89సం.లోని 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థిని-విద్యార్థుల ఆధ్వర్యంలో సదాశివపేట, నిజాంపూర్ రోడ్, దుర్గ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో 27వ తేది ఆదివారము ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగ పూర్వ విద్యార్థిని-విద్యార్థులు మాట్లాడుతు, చదువు నేర్పి, మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మా గురువులకు పాదాభివందనాలను తెలియజేస్తున్నామని అన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన గురువులందరిని గౌరవప్రదంగా శాలువాలతో సత్కరిస్తూ ఆత్మీయతతో వారికి పాదాభివందనాలు చేస్తూ గత స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఈ విధంగా కలుసుకున్నందుకు ఆనందభాష్పాలతో ఒకరినొకరు ఆత్మీయత అనురాగాల మధ్య ఉత్సాహంగ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ, ఈ సంతోషం ఎల్లవేళలా మీ అందరికీ ఉండేలా మీరు మీ పిల్లలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భగవంతుని కృపకు పాత్రులై ఉండేలా ఆశీర్వదిస్తున్నామన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యనిర్వహణలో సీత వైద్యం కిశోర్ ,శేఖర్ గౌడ్‌, అడ్డగట్ల చంద్రశేఖర్, మనోహర్ రెడ్డి,పేట శ్రీనివాస్, తడకం శంకర్, విశ్వనాథం, రాజేష్ టీచర్, పాండు రంగం, హరి, శివ కుమార్, చిలపల్లి వీరన్న, సంగమేశ్వర్‌,వర్కల రాజు, కోట రవీందర్ , రుమాండ్ల ప్రకాశ్ ,శ్రీధర్ రెడ్డి , మల్లికార్జున్, సదానంద్ జైన్, లత, రమాదేవి,అపర్ణ, శోభ, లక్ష్మి, అనురాధ, విజయలక్ష్మీ, అనిత ఆధ్వర్యంలో దేశంలోని వివిద రాష్ట్రాల్లోని పూర్వ విద్యార్థిని, విద్యార్థులు, గురువులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Join WhatsApp

Join Now