గజ్వేల్ లో లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం ఏర్పాటు

హైందవ సోదరుల ఆధ్వర్యంలో లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం ఏర్పాటు

గజ్వేల్, 11 జనవరి 2025 : 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ కోర్టు వద్ద మెయిన్ రోడ్డులో శనివారం హైందవ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించి, లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, డాక్టర్ నరేష్ బాబు, మనోహర్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి చిరస్మరణీయుడని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హైందవ సోదరుల ఆధ్వర్యంలో లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు, లాయర్లు, డాక్టర్లు,వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు,హైందవ సోదరులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now