Site icon PRASHNA AYUDHAM

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ముందడుగు..

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ముందడుగ

ఫోన్ ట్యాపింగ్ కేసులో వెస్ట్ జోన్ డీసీపీ విజయకుమార్ సారథ్యంలో మరో కీలక.ముందడుగు పడింది.

 

ఇటీవల డీసీపీవిజయకుమార్ దర్యాప్తులో ఎవరి పాత్ర ఉన్నట్లుతెలిసిన, వారు ఎంతటి వారైనా, రాజకీయప్రముఖులైనా సరే, ఇంకా ఏ రంగాలకు చెందినవారైనా సరే వదిలి పెట్టే ప్రసక్తే లేదని చెప్పినవిషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో పరారీలోఉన్న ప్రధాన సూత్రధారి మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, మీడియా ఛానల్ యజమాని శ్రావణ్కుమార్ కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకుస్వయంగా రంగంలోకి దిగారు. అమెరికాలో ఉన్న ఈ నిందుతులకు రెడ్ కార్నర్ నోటీసులు అందించేందుకు ఇంటర్ పోలు అనుబంధంగా మన దేశంలో ఎన్ సీబీ (నేషనల్ సెంట్రల్ బ్యూరో) అధికారులు, సీబీఐతో సమన్వయం చేస్తున్నారు. ఇలా ప్రయత్నం చేసి నిందితులకు త్వరగా రెడ్ కార్నర్ నోటీసులు అందేలా పని చేస్తున్నారు. అమెరికా, భారత్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం ఉన్న మార్గదర్శకాలను అనుసరించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నాంపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ సమయంలో నిందితులకు ఎన్బీడబ్ల్యూ జారీ చేసారా అని అడిగిన ప్రశ్నకు పోలీసులు ఈ వివరాలను జవాబుగా చెప్పినట్లు తెలిసింది..

Exit mobile version