*తాడిచెట్టు పైనుండి ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడి గాయాలపాలైన గీత కార్మికుడు*
*జమ్మికుంట ఇల్లందకుంట జూన్ 25 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని రవీందర్ గౌడ్ అనే గీత కార్మికుడు నిత్య వృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కుతుండగా తాటిచెట్టు పై నుండి మోకుజారి కింద పడగా తీవ్రగాయాలు కాగా జమ్మికుంట లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానికులు తెలిపారు రెక్క ఆడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని తోటి కార్మికులు కోరుతున్నారు