బాలుర ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ
—జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 18
ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుని ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.జిల్లా కేంద్రం లోని బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పదవ తరగతి విద్యార్థులతో సంభాషిస్తూ ప్రతిరోజూ పాఠశాలకు రెగ్యులర్ గా హాజరు కావాలని ఐ ఐ ఐ టి సాధించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానిలోపాధ్యాయులు ఎఫ్ ఆర్ ఎస్ , యూనిఫారం, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఎల్ ఐ పీ తప్పనిసరిగా ఆన్లైన్ ఎంట్రీ చేయాలని ఆదేశించారు. ఐ ఎఫ్ పీ ప్యానెల్స్ వినియోగించాలని, విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ పెట్టీ ఉన్నత ఫలితాలు సాధించాలని ఆదేశించారు. వన మహోత్సవం లో భాగంగనాయం మొక్కలు నాటారు. నాటి మొక్కలు పరిరక్షించాలని, పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థుల హాజరు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులహాజరు మెరుగు పరిచేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. భవిత సెంటర్ లో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, మున్సిపల్ కమీషనర్ రాజేందర్, విద్యాశాఖ సమన్వయకర్త వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయురాలు కరుణ శ్రీ తదితరులు పాల్గొన్నారు.