కుట్టు మిషన్ కేంద్రాన్ని సందర్శించిన స్పెయిన్ బృందం

*కుట్టు మిషన్ కేంద్రాన్ని సందర్శించిన స్పెయిన్ బృందం*

గంగాధర మండలంలోని కాచిరెడ్డి పల్లె గ్రామంలో

.గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సేవలను అందిస్తున్న మానస్ యూనిదాస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

మాజీ సర్పంచ్ జోగు లక్ష్మిరాజం(సాగర్)కోరారు.పాతిమనగర్ అడోరేషన్ సంస్థ వారు కాచిరెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చేతిపంపు మరియు మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం స్పెయిన్ దేశం నుండి వచ్చిన మానస్ యునిదాస్ ప్రతినిధులు రోషియో.ఆల్బర్ట్ లు సందర్శించారు.మహిళలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం బతుకమ్మ ఆటలలో పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ ఎవరికి ఏమి.సహాయం అవసరం పడుతుందో వారికి మానస్ యునీదాస్ సంస్థ సహాయం అందిస్తుందని అన్నారు.స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ ప్రాంతాలలోని పేదలకు మహిళలకు పిల్లలకు సహాయం అందించి అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు మహిళలకు కష్టపడి ఎదగడానికి వృత్తి నైపుణ్యాన్ని పెంపొదించి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సహకరిస్తుందని అన్నారు మా సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ జోగు లక్ష్మిరాజం(సాగర్).పాతిమా నగర్ అదోరేషన్ సంస్థ డైరెక్టర్ అనీష్.ప్రీత.కోఆర్డినేటర్ దీప్తి.సంస్థ ప్రతినిధులు వెలంకిని.మల్లేశం.శ్రీనివాస్ రెడ్డి.స్రవంతి.రమేష్.మౌనిక.జమున.తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment