జిల్లా ప్రణాళిక, పౌర సంబంధాల అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోస్ బృందం

జిల్లా ప్రణాళిక, పౌర సంబంధాల అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోస్ బృందం

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తామని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 25

 

కామారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చి జిల్లా ప్రణాళిక అధికారిగా జి. రఘునందన్ మరియు జిల్లా పౌర సంబంధాల అధికారిగా తిరుమల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన జిల్లా శాఖ బృందం శనివారం మర్యాదపూర్వకంగా వారిని కలిసింది.

ఈ సందర్భంగా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, “టీఎన్జీవోస్ సంఘం ఉద్యోగుల హక్కుల రక్షణతో పాటు సామాజిక బాధ్యతతో కూడిన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోంది” అని తెలిపారు.

దీనికి స్పందించిన జిల్లా ప్రణాళిక అధికారి మరియు పౌర సంబంధాల అధికారులు టీఎన్జీవోస్ సంఘం సేవా భావాన్ని ప్రశంసిస్తూ, “ఉద్యోగుల చిత్తశుద్ధి, నిబద్ధతతో కలిసి పనిచేస్తే కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ముందువరుసలో నిలుస్తుంది” అని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు, కోశాధికారి ఎమ్. దేవరాజు, కేంద్ర సంఘ బాధ్యులు కె. శివకుమార్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, రాజ్యలక్ష్మి, ఎం.సి. పోచయ్య, రాజేశ్వర్, సంయుక్త కార్యదర్శి రాజమణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్. సంతోష్ కుమార్, ఈసీ సభ్యులు సాయినాథ్, దత్తాద్రి, లక్ష్మణ్, అర్బన్ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి లక్ష్మీ నర్సవ్వ, ఈసీ మెంబర్ సురేఖ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment