*దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి మద్యం షాపులో నిద్ర పోయిన దొంగ..*
*మెదక్ జిల్లా:*
మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం సేవించి నిద్రపోయిన ఘటన నార్సింగిలోని కనకదుర్గ వైన్స్ లో జరిగింది.ఆదివారం రాత్రి వైన్ షాపు మూసేసి ఇంటికి వెళ్లిపోయాడు యజమాని.ఇదే అదునుగా భావించి దొంగతనానికి వచ్చిన దొంగ షాపులో దూరి కౌంటర్ లో ఉన్న నగదును,మద్యం బాటిళ్లను ఓ సంచిలో మూట కట్టుకున్నాడు.దొంగతనం తర్వాత మద్యాన్ని చూసేసరికి నోరూరి వెళ్ళేటప్పుడు ఫుల్లుగా మద్యం తాగి మత్తులోనే నిద్రపోయాడు.సోమవారం యదావిధిగా షాపు యజమాని షాపు తెరిచి చూడగా వైన్ షాపులో నిద్రపోయిన దొంగ చూసి కంగుతిన్నాడు..