స్వచ్ఛందంగా స్వదేశం వెళ్లే అక్రమ వలసదారులకు వెయ్యి డాలర్ల నగదు ప్రోత్సాహకం..

స్వచ్ఛందంగా స్వదేశం వెళ్లే అక్రమ వలసదారులకు వెయ్యి డాలర్ల నగదు ప్రోత్సాహకం… అమెరికా కీలక ప్రకటన

అమెరికాలో అక్రమ వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త పథకం

స్వచ్ఛందంగా స్వదేశాలకు వెళ్లేవారికి 1000 డాలర్ల నగదు ప్రోత్సాహకం,

ప్రయాణ ఖర్చులు

‘సీబీపీ హోమ్ యాప్’ ద్వారా నమోదు చేసుకుని,

వెళ్లినట్లు ధ్రువీకరించుకోవాలి

తద్వారా బహిష్కరణ ఖర్చులు 70% తగ్గుతాయని హోంల్యాండ్ సెక్యూరిటీ అంచనా

అరెస్టును నివారించుకోవడానికి ఇదే ఉత్తమ మార్గమని ప్రభుత్వ సూచన

అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియను వేగవంతం చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛందంగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లే వారికి 1000 డాలర్ల నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రయాణ ఖర్చులను కూడా చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ కొత్త విధానం కోసం కస్టమ్స్ & బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) రూపొందించిన ‘సీబీపీ హోమ్ యాప్’ను ఉపయోగించుకోవాలని డీహెచ్‌ఎస్ సూచించింది. ఈ యాప్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకుని, స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు నిర్ధారించుకున్న తర్వాత

Join WhatsApp

Join Now