Site icon PRASHNA AYUDHAM

అలుపెరగని ఉద్యమ నాయకుడు!!

ముప్పై ఏండ్ల సుధీర్ఘ పోరాటం ద్వారా యస్సీ వర్గీకరణ ఫలితం రాబట్టిన

మంద కృష్ణ మాదిగ అలుపెరుగని ఉద్యమ శ్రామికుడు

వర్గీకరణ తీర్పు సుప్రీం కోర్టు ఇచ్చిన సందర్భంగా ఎమ్మార్పియస్ నాయకులకు బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణి చేసిన

బీసి బలహీన వర్గాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కానుగంటి శ్రీశైలం కురుమ

ప్రశ్న ఆయుధం 1ఆగష్టు
ఆత్మకూర్ (యం ) మండల కేంద్రంలో
బీసి బలహీన వర్గాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కానుగంటి శ్రీశైలం కురుమ ఆధ్వర్యంలో యస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు వచ్చిన సందర్బంగా ఎమ్మార్పియస్ రాష్ట్ర నాయకులు – యం యస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ మరియు సీనియర్ నాయకులు గట్టు రాములు మాదిగ, మందుల లింగ స్వామి మాదిగ,గట్టు శేఖర్ మాదిగ, గట్టు శ్రీరాములు మాదిగ, తదితర నాయకులకు మిఠాయిలు పంచడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
ఎమ్మార్పియస్ వ్యవస్థపాక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అలుపెరుగనిపోరాటం ద్వారా ముప్పై ఏండ్లు ఉద్యమాన్ని నడిపి తుది ఫలితం సాధించాడని మంద కృష్ణ మాదిగ పోరాటం లో సందర్భాన్ని బట్టి ఉద్యమం లో స్థానిక నాయకులతో కలసి భాగస్వామ్యం కావడం ఆనందం కలిగిస్తుంది అని అన్నారు.
భవిష్యత్ లో కూడా మంద కృష్ణ మాదిగ పోరాటానికి ప్రజా స్వామిక వాదులుగా మద్దతుగా నిలుస్తాం అని అన్నారు.
ఈ కార్యక్రమం లో
అగ్రవర్ణ పేదల సంఘం నాయకులు కౌకుంట్ల మధు సుధన్ రెడ్డి,
తుమ్మల సత్య నారాయణ రెడ్డి,
బీసీ బలహీన వర్గాల సంక్షేమ సంఘం నాయకులు బొంత మల్లయ్య వడ్డెర, పైళ్ల మల్లయ్య రజక తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version