పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడికి సన్మానం..

IMG 20240810 WA0103

గూడూరు మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయులు గూడూరు రవీందర్ రెడ్డి గత 30 సంవత్సరాలనుండి వివిధ పాఠశాలలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ ఇటీవల పదవీ విరమణ పొందారు..ఈ మేరకు శనివారం మండల కేంద్రములో బ్లాక్ కాంగ్రెస్ ఆధ్యక్షులు యాట నర్సింహా ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యాట నర్సింహా తో పాటు పలువురు మాట్లాడుతూ,, ఉపాధ్యాయ వృత్తిలో గత 30 సంవత్సరాలనుండి రవీందర్ రెడ్డి చేసిన సేవలను వారు కొనియాడారు. పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో సర్వసాధారణమని, పనిచేసిన పాఠశాలలో విద్యార్థులతో తోటి ఉపాధ్యాయులతో మంచి పేరు తెచ్చుకున్న రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయుడిగా వారు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడిని విద్యార్థులు జీవితాంతం మర్చిపోరని తెలిపారు.అనంతరం ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డీని నాయకులు శాలువాతో సత్కరించారు.. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి,,మాజీ కో ఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now