మను సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడటమే సావిత్రిబాయి పూలే కి ఇచ్చే నివాళి
సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య
గజ్వేల్ జనవరి 3 ప్రశ్న ఆయుధం :
సనాతన మను ధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా పోరాటమే సావిత్రిబాయి కి ఇచ్చే నివాళి అని సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య అన్నారు. సిఐటియు, కెవిపిఎస్, ఐద్వా ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 193 వ జయంతి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య, ఉపాధ్యక్షులు బండ్ల స్వామి, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరాటి కృష్ణమూర్తి, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి సంద బోయిన రాణి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1931 జనవరి 3 న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నాయిగావ్ గ్రామంలో జన్మించడం జరిగిందని 9 సంవత్సరాలకే మహాత్మ జ్యోతిరావు పూలే తో వివాహం జరిగిందని అన్నారు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే కు చదువు నేర్పి ఆమె ద్వారా 1948 లో మొట్టమొదట సరిగా మహిళా పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు సావిత్రిబాయి పూలే పై భౌతికంగా దాడులు జరిపిన, పెడ, బురదను చల్లిన, రాళ్లతో కొట్టిన మొక్కవోని దీక్షతో మహిళలకు చదువు నేర్పిందని అన్నారు. వితంతువులకు వివాహం జరిపిందని, వితంతువులకు పుట్టిన పిల్లలను చేరదీసి చదువు చెప్పిందని అన్నారు. కలరా టైఫాయిడ్ అంటివాదులు ప్రబలినప్పుడు వైద్యం చేసిందని తెలిపారు కరువు వచ్చినప్పుడు ప్రజల నుంచి విరాళాలు సేకరించి గంజి కేంద్రాలు పెట్టి సామాజిక కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు మహిళలు చదువుకుంటే దేశం బాగుపడుతుందని అస్పృశ్యత నేరమని అందరూ సమానంగా ఉండాలని సమాన హక్కులు ఉండాలని పోరాటం నిర్వహించిందని అన్నారు. నేటి బిజెపి ప్రభుత్వం మనుధర్మ శాస్త్ర విధానాలు అమలు జరిపి ప్రజలలో ఐక్యతకానివ్వకుండా విచ్చిన్నం చేస్తుందని అన్నారు. వివక్ష పాటిస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగంను క్రమంగా ప్రైవేటీకరణ చేసి రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా దళితులు మహిళలు మైనార్టీల పై దాడులు పెరిగాయని రాజ్యాంగం కల్పించిన హక్కులను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. ప్రజల మధ్య ఉద్రిక్తతలు జరిగే విధంగా వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు తెలంగాణ ప్రభుత్వం జాతీయ మహిళా టీచర్ దినోత్సవం ప్రకటించడం హర్షనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కుమార్ శ్రీనివాస్ అఫ్జల్ నర్సింలు బాలమణి, రాణి తదితరులు పాల్గొన్నారు.