ప్రతి ఇంటిమీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి
దేశభక్తిని ప్రతి ఒక్కరు చాటాలి రామకోటి రామరాజు
సిద్దిపేట ఆగస్టు 11 ప్రశ్న ఆయుధం :
స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 న ప్రతి ఒక్కరు జాతీయ జెండాలను ఎగురావేయాలని జాతీయ జెండాలను ఆదివారం నాడు ఆవిష్కరించి పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ముచ్చటైన మన మూడు రంగులంజెండాను మన ఇంటి పై ఎగరవేసి ప్రతి ఒక్కరు కూడ దేశభక్తి చాటాలన్నారు. ప్రతి వ్యక్తిలోనూ దేశభక్తి ఉప్పొంగాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశం అన్నారు. సర్వ మతాలకు మన దేశం పుట్టినిల్లు అన్నారు. ఈ నెల 13 నుండి 15 వరకు ప్రతి ఇంటి పై త్రివర్ణ పతకాన్ని ఎగరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అమృత క్లినిక్ అధినేత వేములవాడ కనకచారి, రాజకుమార్, భాస్కర్, మల్లేశం, లక్ష్మీ నర్సయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.