Site icon PRASHNA AYUDHAM

నియమాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక

IMG 20251020 182513

టపాకాయల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

నియమాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక

కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 20

జిల్లా కేంద్రంలోని టపాకాయల దుకాణాలపై అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  జిల్లాలో అనుమతించబడిన 22 షాపులను స్వయంగా పర్యవేక్షించి, యజమానులు నిర్దేశించిన భద్రతా నియమాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించారు. కొన్ని షాపుల్లో చిన్నపాటి లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడంలో ఎవరు నిర్లక్ష్యం చూపినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగ సీజన్‌లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Exit mobile version