వికారాబాద్ జిల్లా: పరిగిలో తెలంగాణ ఐజీ సత్య నారాయణ ప్రెస్ మీట్
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి బుధవారం ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన ఐజీ
నరేందర్ రెడ్డికి కోర్టు ఇచ్చిన బెయిల్ షరతులతో కూడినది
ఆయనపై నమోదైన కేసు ఆక్రమమని నరేందర్ రెడ్డి బుధవారం ప్రెస్ మీట్లో చెప్పాడు.
అది తప్పు… విచారణ అనంతరం అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేశాం
దాడికి ముందు రోజే పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ లు దాడి చేయాలని పథకం పన్నారు
సురేష్ కావాలనే కలెక్టర్ దృష్టి మరల్చి గ్రామంలోకి తీసుకెళ్ళాడు
సురేష్ మాటలు నమ్మి మంచి జరుగుతుందని సదుద్దేశంతో కలెక్టర్ గ్రామంలోకి వెళ్ళారు
పథకం ప్రకారం సురేష్ అనుచరులు రాళ్ళు కర్రలతో కలెక్టర్, అధికారులపై దాడి చేశారు
కలెక్టర్ సౌమ్ముడు… పోలీసులు వస్తామంటే వద్దన్నాడు
దాడికి వారం ముందే పట్నం నరేందర్ రెడ్డి ఆయా గ్రామాల్లో తిరిగి దాడి చేయాలని రెచ్చగొట్టారు
అది సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది..
సురేష్, మహేష్ లు ఇద్దరు ఆ తర్వాత అధికారులపై దాడి చేయాలని పథకం పన్నారు
ఆ పథకం ప్రకారమే దాడి చేశారు…
అక్రమంగా కేసులు పెట్టారు అనేది తప్పు… నిఘా వైఫల్యం కానేకాదు
అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలిసు బందోబస్తు తోనే అక్కడికి వెళ్ళాం
దాడిలో పాల్గొన్న నిందితులను ఎవ్వరినీ పోలీసులు కొట్టలేదు.. జడ్జి ముందు కూడా చెప్పలేదు
నరేందర్ రెడ్డి తన ఫోన్ పాస్వర్డ్ చెప్పకుండా విచారణకు సహకరించడంలేదు
సురేష్ తన సిమ్ కార్డు విరిచి ఏదో వాహనంలో పడేశానని చెబుతున్నాడు
ఇద్దరు పోలీసుల విచారణకు సహకరించడం లేదు..
నిందితుడికి బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్ళిన ఘటనలో జైలు అధికారులపై చర్య తీసుకోవడం జరిగింది
సురేష్ సంబంధించిన కొన్ని ఆడియోలు తమ వద్ద ఉన్నాయి.. సమయమొచ్చినప్పుడు బయటపెడుతాం
దాడికి ముందు రోజు లిక్కర్ ఎక్కడి నుండి వచ్చింది.. దాడి ప్లాన్ లో ఎవరెవరు అనేది దర్యాప్తు చేస్తున్నాం
అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాకే ఎఫ్ఐఆర్ లో పేర్లు చేర్చాం..
ప్రెస్ మీట్ పెట్టి కోర్టులో విచారణ లో ఉన్న కేసు పై నరేందర్ రెడ్డి మాట్లాడటం తగదు
పోలీసులు శాంతిభద్రతల కోసమే పని చేస్తారు..
ఈ కేసులో అమాయకులు ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు..