హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. 

హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.

55 సంవత్సరాలు నిండిన వారికి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి.

సిఐటియు జిల్లా కార్యదర్శి గోపాల స్వామి డిమాండ్.

సిద్దిపేట డిసెంబర్ 30 ప్రశ్న ఆయుధం :

హమాలీ కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, 55 సంవత్సరాలు నిండిన ప్రతి హమాలీ కార్మికుడికి నెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని సిఐటియు సిద్దిపేట జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి డిమాండ్ చేశారు. సోమవారం రోజున సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం గోపాలస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హమాలీ కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తారని దాని ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని వాటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర ప్రభుత్వం అమాలి కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని దాని ద్వారా సెస్సు డబ్బులతోటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. 55 సంవత్సరాలు నిండిన ప్రతి హమాలీ మాలిక కార్మికుడికి పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి హమాలీ కార్మికుడికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, సాధారణ మరణం చెందుతే ఐదు లక్షలు ఇవ్వాలని కోరారు. హమాలి కార్మికులకి ఐకెపి సెంటర్ తాడుమామలు, బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షుడు మామిడాల కనకయ్య, నాయకులు వెంకటాచారి, మల్లం రమేష్, మల్ల మొగిలి, చొప్పరి కనకయ్య, చొప్పరి మల్లయ్య, తీవుల కనకయ్య, సంపత్, నీరట కృష్ణ,ఎల్లయ్య, బిక్షపతి , రాజయ్య, బాలరాజు,బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now