భర్తను ప్రియుడు ద్వారా హత్య చేపించిన భార్య

భర్తను ప్రియుడు ద్వారా హత్య చేపించిన భార్య:

తేదీ 1-04-2025 నాడు, ఒక మగ వ్యక్తి మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరింగ్ తండా సమీపంలో చనిపోయి ఉన్నాడాని అట్టి విషయంలో ఫిర్యాదు రాగా గుర్తు తెలియని వ్యక్తులు పార్థసారథి అనే వ్యక్తిని చంపినారు అనే ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినారు. దర్యాప్తులో భాగంగా విచారణ సమయంలో పార్థసారథి యొక్క భార్య అయిన తాటి స్వప్నకు మరియు గవర్నమెంట్ టీచర్ అయిన వెంకట విద్యాసాగర్ అనే వ్యక్తికి పరిచయము మరియు అక్రమ సంబంధం ఉన్నాయని విషయాలు పెద్ద మనుషుల సమక్షంలో దానిని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించినారు, అయినప్పటికీ వారిద్దరూ ఆ సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో భార్యాభర్తలకు చాలాసార్లు గొడవలు అయినాయి మరియు హెచ్చరించిన కూడా వినలేదు వారిపై మాకు అనుమానం ఉన్నదని విషయం తెలియపరచగా, దానిలో భాగంగా ఈరోజు స్వప్నను మరియు సాగర్ ను విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారు. ఆ నేరం లో భాగంగా, ఈ విషయంలో ఇద్దరినీ విచారించగా వారిద్దరూ చాలా సంవత్సరాల నుండి వారి యొక్క సంబంధాన్ని కొనసాగిస్తున్నారు, ఈ మధ్యలో స్వప్న భర్త అయినా మృతుడు మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి లో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుండగా అస్తమానం మృతుడు భార్యను అనుమానిస్తూ వీడియో కాల్స్ లో ఇబ్బంది పెడుతుండగా తనని అడ్డుతప్పించాలని ఉద్దేశంతో స్వప్న మరియు సాగర్లు, వినయ్ కుమార్, శివశంకర్ మరియు వంశీ ల సహాయంతో పార్ధసారథిని హత్య చేయుటకు ఐదు లక్షల రూపాయలు సుపారిగా ఇచ్చుటకు ఒప్పుకున్నారు. దానిలో భాగంగా సాగర్ ఉగాది సెలవులకు మార్చి 28వ తేదీన కొత్తగూడెం వచ్చి అక్కడ నుండి మరల మార్చి 31వ తేదీన తిరిగి డ్యూటీ జాయిన్ అవ్వడం కోసం దంతాలపల్లి వెళుతుండగా, ఈ విషయమును పార్థసారథి భార్య అయిన స్వప్న, సాగర్ కు ఫోన్ ద్వారా తెలియపరచగా అదే విషయాన్ని సాగర్ ఒక ఇనోవా క్రిస్ట బండిని మరియు కొంత సొమ్మును ఇచ్చి హత్య చేయుటకు పంపినారు. వారు వచ్చి మహబూబాబాద్ దాటిన తర్వాత బోరింగ్ తండా సమీపంలో హత్య చేసినారు అని విదారణలో తెలిసింది. ప్రస్తుతము తాటి స్వప్న మరియు వెంకట విద్యాసాగర్ ను అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన వారి కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి.

ఇట్టి విషయంలో వేగంగా స్పందించి వారిని అరెస్ట్ చేసే విషయంలో చొరవ చూపినందుకు మహబూబాబాద్ డిఎస్సీ N. తిరుపతి రావు ని, మహబూబాబాద్ రూరల్ సిఐ P. సర్వాయ్య ని, బయ్యారం సిఐ B.రవికుమార్ ని, గూడూర్ సిఐ G. సూర్యప్రకాష్ ని, SB సిఐ చంద్రమౌళి ని, CCS సిఐ హాతీరాం ని మరియు మహబూబాబాద్ రూరల్ SI, V. దీపికా ని, గూడూర్ SI B.గిరిధర్ రెడ్డి ని, కేసముద్రం, బయ్యారం, రవి SI లను, IT core staff మరియు ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించినారు.

నిందితుల వివరాలు :

1. తాటి స్వప్న, భర్త: పార్థసారథి, వయస్సు: 33 సం.రాలు, కులం: కాపు, వృత్తి: గృహిణి, R/O జగదీష్ కాలనీ భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

2. సొర్లాం వెంకట విద్యాసాగర్, తండ్రి: సాంబశివరావు, వయస్సు: 37సం.లు, కులం: ST-కోయ, వృత్తి: గవర్నమెంట్ టీచర్-నెల్లిపాక గ్రామం, ఏటపాక మండలం, అల్లురిసీతారామరాజు జిల్లా, N/o జెడ్డేంగి గ్రామం, రాజవొమంగి మండలం, అల్లురిసీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, R/O ITDA ఆఫీసు, Opp YSR నగర్, భద్రచలం.

Absconding:

3. వినయ్ కుమార్

4. శివ శంకర్

5. వంశీ

6. కుసం లవరాజ్

Join WhatsApp

Join Now

Leave a Comment