ఓ ఎమ్మెల్యే తులం బంగారం ఏది…
చెక్కుల పంపిణీలో ఓ మహిళ నుండి ఎదురైన ప్రశ్న
దృశ్యం కవర్ చేస్తున్న విలేకరిపై దుర్భాసులాడిన ఓ కాంగ్రెస్ నాయకుడు అతని అనుచరులు..
ఓ ఎమ్మెల్యే తులం బంగారం ఏది… అంటూ తనికళ్ళలో ఓ మహిళ ప్రశ్నించింది
ఎన్నికలకు ముందు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు
ఏడాది గడిచినా ఇప్పటివరకు ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు చెక్కుల పంపిణీదేముంది ఈ చెక్కులు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇచ్చారు మీ గొప్పతనం ఏముంది అని ఓ మహిళ అడిగింది కొణిజర్ల మండల పరిధిలోని తనికెళ్ళ గ్రామంలో రైతు వేదిక వద్ద మంగళవారం జరిగిన సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ మహిళ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మహిళలకు 2500 పెన్షన్ ఇవ్వాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిలదీసినట్టుగా మాట్లాడారు మహిళలు అడక్కపోయినా ఉచిత బస్సుపాస్ పెట్టారని రద్దీ పెరిగినప్పటికీ బస్సులు పెంచకుండా మహిళలు నిత్యం ఘర్షణ పడే విధంగా చేశారని అన్నారు. గర్భిణీ స్త్రీలకు పసిపిల్ల తల్లులకు వృద్ధులకు వికలాంగులకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఒక్కసారిగా మహిళ నుండి ఎదురైనా పరిణామంతో ఎమ్మెల్యే విస్తుపోయారు ఆ మహిళ సముదాయిస్తూ అన్ని హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని త్వరలోనే ఇచ్చిన అన్ని హామీలు ప్రభుత్వ నెరవేరుస్తుందని చెపుతుండగా కొనిజర్ల ఓ కాంగ్రెస్ నాయకుడు మహిళను పక్కకు నెట్టారు ఈ మొత్తం దృశ్యాలను కవర్ చేస్తున్న తెలంగాణ పత్రిక, విలేకరిని వీడియోలు తీయొద్దంటూ కొనిజర్ల ఓ నాయకుడు అతని అనుచరులు దుర్భాషలాడుతూ విడియో డిలీట్ చెయ్ అని బెదిరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్ మండల అధ్యక్షులు వడ్డే నారాయణ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కోసూరు శ్రీనివాసరావు మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు