మహిళ దారుణ హత్య.. తల, చేయి లేకుండా మృతదేహం

*మహిళ దారుణ హత్య.. తల, చేయి లేకుండా మృతదేహం*

-మిట్టపూర్ శివారులో ఘటన – కమిషనర్ పరిశీలన-

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్ 1
(ప్రశ్న ఆయుధం)

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టపూర్ శివారులో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమైంది. తల, కుడి చేయి మణికట్టు వరకు లేకుండా కనిపించడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. మృతురాలి వయసు సుమారు 20 నుండి 40 సంవత్సరాల మధ్యగా పోలీసులు అంచనా వేస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్, సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను అక్కడికి రప్పించి ఆధారాలు సేకరించారు. హత్య వెనుక కారణాలు, నిందితుల గుర్తింపు కోసం 10 ప్రత్యేక బృందాలను కమిషనర్ నియమించారు.

ఈ సందర్భంగా ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట్ ఎస్సై సిహెచ్. తిరుపతి తదితరులు కమిషనర్‌తో కలిసి దర్యాప్తు చర్యల్లో పాల్గొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment