జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంటును రెండవ రోజు పోటీలను ప్రారంభించిన యువ నాయకులు మాటేటి కిరణ్ కుమార్…
స్థానిక ఎస్ ఆర్ & బిజిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంతోష్ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బలుసు మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటును రెండవ రోజు ముఖ్య అతిథిగా ఖమ్మం పట్టణ బిఆర్ఎస్ నాయకులు మాటేటి కిరణ్ కుమార్ ప్రారంభించారు . సంతోష మెమోరియల్ టోర్నమెంట్ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల నుంచి 40 క్రికెట్ క్రీడా జట్లు పాల్గొంటున్నాయి . నాయకులు మాటేటి కిరణ్ కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు . బలుసు మురళి తన స్నేహితుని పేరు మీద ఈ మ్యాచులు తన స్నేహితుని జ్ఞాపకాలు గుర్తు చేస్తూ స్నేహానికి ఉన్న విలువను మరొక్కసారి నిరూపించారన్నారు . యువత మొబైల్ లకే పరిమితం అవ్వకుండా ప్రతిరోజు కనీసం ఒక గంట బహిరంగ ఆటలు ఆడాలని సూచించారు . దీనివలన శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అని సూచించారు . అలాగే పాల్గొన్న అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ బలుసు మురళీకృష్ణ , సాయి కళ్యాణ్ , వియుకే ప్రాన్స్ ఉపేందర్ , నజీర్ , ఆర్గనైజింగ్ కమిటీ – కోమటిల్లి సాయి కృష్ణ చైతన్య , కొనపర్తి గోపి , ఆలేటి వెంకటేష్ , కొమ్ము మహేష్ , కే.సాయి , భరత్ చౌదరి , అభి , నాని , హనీష్ , పి.సాయి , సాయి చందు తదితరులు పాల్గొన్నారు .