పురుగుల మందు త్రాగి యువకుడు మృతి
జమ్మికుంట /ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 26
మండలంలోని చిన్న కోమటిపల్లి గ్రామానికి చెందిన మూడేడ్ల సురేష్ 21 సంవత్సరాలు కలుపు మొక్కలు నాశనం చేసే(పురుగు) మందు త్రాగి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిన్న కోమటిపల్లి గ్రామానికి చెందిన మూడేడ్ల సురేష్ ట్రాక్టర్ నడుపుతూ జీవించేవాడు మద్యానికి బానిసై పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండేవాడని ఈనెల 18 ఆదివారం రోజున సాయంత్రం మృతుడు సురేష్ తన తండ్రి రవి కి గడ్డి మందు తాగిన విషయం ఫోన్లో చెప్పగా చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రైవేట్ హాస్పిటల్ నుండి వరంగల్ అజర హాస్పిటల్ కు తరలించగా సీరియస్ గా ఉన్నాడని చెప్పడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తీసుకెళ్తుండగా 25 తేదీ ఆదివారం రోజున మృతి చెందాడని మృతుని తండ్రి మూడెడ్ల రవి తెలపగా తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజకుమార్ తెలిపారు.