Site icon PRASHNA AYUDHAM

ట్రాక్టర్ బోల్తా..యువకుడి మృతి

IMG 20251223 114241

Oplus_16908288

గాంధారి మండలం/డిసెంబర్ 23, కామారెడ్డి జిల్లా: గాంధారి మండలం కాయితీ తండా గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది వ్యక్తులు ట్రాక్టర్‌పై ప్రయాణిస్తుండగా.. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఒక యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల ప్రకారం.. కాయితీ తండా గ్రామం నుంచి చేద్మాల్ తండా గ్రామ శివారులోని లక్ష్మమ్మ టెంపుల్ వద్ద నిర్వహిస్తున్న ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు ట్రాక్టర్‌పై వెళ్తున్న సమయంలో నేరల్ గ్రామం దాటిన తరువాత రైతు వేదిక సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై ఉన్న మంజ గణేష్ (15) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి మంజ కిషన్‌కు తీవ్ర రక్త గాయాలు కాగా, మిగిలిన ఐదుగురికి స్వల్ప రక్త గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంతో కాయితీ తండా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని ఎస్ఐ ఆంజనేయులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version