రోడ్ ప్రమాదంలో యువకుని మృతి,
సూర్యాపేట జనవరి 16
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎస్ ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ పట్టణంలొ సుందరయ్య కాలానికి చెందిన కంటూ అరవింద్ 28 సం.రాలు, ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు, తేదీ 15.1.25 బుధవారం రాత్రి 10.55 గంటల సమయంలో మృతుడు మధవరైని గూడెం గ్రామంలో జరుగుచున్న కబడ్డీ పోటీలు తిలకించడానికి ఏపీ 24 టీసీ 1781 నెంబర్ గల ఆటో నడుపుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యలో పి ఎస్ టి ఆఫీస్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న ట్యాంకర్ ను తప్పించబోయి ప్రమాదవశాత్తు రోడ్ డివైడర్ ను గుద్దుకొని తలకు బలమైన గాయం తగిలి అక్కడిక్కడే మరణించినాడని మృతుని తండ్రి కంటు హనుమంతు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము తెలిపారు.