సంగారెడ్డి/పటాన్ చెరు, డిసెంబర్ 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో శునివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానివెల్స్ కంపెనీ గేటు వెలుపలికి స్కూటీపై వెళ్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన జేసీబీ వాహనం స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విశాల్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం ప్రధాన రహదారిపై ఇటు–అటు వాహనాలు అధికంగా నిలిపివేయడం వల్ల రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదం జరిగిందని తెలిపారు. పారిశ్రామికవాడ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ లోపించడంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన విశాల్ కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బొంతపల్లి పారిశ్రామికవాడలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
Oplus_16908288