దండేపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Dec 16, 2024,
దండేపల్లి మండలంలోని కొరిమి చర్ల గ్రామానికి చెందిన వెంబడి సాయికుమార్ (21) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. ఈనెల 14న సాయంత్రం సాయికుమార్, అతని స్నేహితుడు అల్లం రాజులు కలిసి ముత్యంపేట వద్ద రోడ్డు పక్కన మోటార్ సైకిల్ ఆపి నిలిచి ఉన్నారు. వెనుక నుంచి వచ్చిన లారీ సాయికుమార్ ను అతివేగంగా ఢీకొట్టడంతో టైర్ కింద పడిపోయాడు. ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై వెల్లడించారు.