**చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు**
నర్సాపూర్ ప్రతినిధి నవంబర్:28
యువకుడు గత వారం రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పోలీసుల వివరాలిలా ఉన్నాయి… మండల పరిధిలోని సలాబత్ పూర్ గ్రామానికి చెందిన చాకలి మధు (18) అంజల శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో సొంత పనుల నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరాడు. కింద పడిపోయాడు. వెనుకే వస్తున్న బుడ్యా తండాకు చెందిన కాట్రోత్‌ఫుల్ సింగ్ గమనించి కుటుంబ సభ్యులకు చెప్పాడు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 సహాయంతో నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. వారం రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చాకలి మధు గురువారం మృతి చెందాడు. అతని తండ్రి దుర్గయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై రంజిత్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు