చిన్న మల్లారెడ్డి చెరువులో పడి యువకుడి మృతి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 22
ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఒక యువకుడు చిన్న మల్లారెడ్డి లో గల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేటకు చెందిన గొడుగు సుధాకర్(30) ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. దీంతో కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.