ఆమ్ ఆద్మీ పార్టీ లో భారీగా చేరికలు
స్థానిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది – ఆఫ్ జిల్లా కన్వీనర్ మదన్ లాల్ జాదవ్
ప్రశ్న ఆయుధం ఆగష్టు 9,
కామారెడ్డి పట్టణ కేంద్రంలో, దేవునిపల్లి లో, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ మాలోత్ మదన్ లాల్ జాదవ్ ఆధ్వర్యంలో పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆప్ జిల్లా కన్వీనర్ మదన్ లాల్ జాదవ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో అరవింద్ కేజ్రివాల్ చేసినటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై ఆమ్ ఆద్మీ పార్టీలో గంగమణి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా చేరడం జరిగిందని అన్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పడి చాలా రోజులు గడుస్తున్న కూడా స్థానిక సంస్థలు ఎన్నికల పై క్లారిటీ ఇవ్వకపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సరికాదని అన్నారు.ఇచ్చిన 420 హామీలు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. అలాగే మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి పురుషులకు మాత్రం టికెట్ రెట్టింపు చేశారని, నిత్యవసర ధరలు చాలా పెంచారని, రేవంత్ రెడ్డి ది ఢిల్లీలో ఒక సంసారం, తెలంగాణలో మరొక సంసారం అని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలి అని అన్నారు. అనంతరం పార్టీలో జాయిన్ అయిన మహిళలకు జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జ్ మహిళా జిల్లా అధ్యక్షురాలుగా గంగమణి ని, అలాగే లింగంపేట్ మండల్ ఇంచార్జ్ మహిళా మండల అధ్యక్షురాలు గా అల్లవ్వ ని నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు వనిత, లక్ష్మి, గంగాధర్, ఆర్ విట్టల్, దీప, సుజాత తదితరులు పాల్గొన్నారు.