అమీర్పేట్ మైత్రి వనమా..? సముద్రమా..? ఏం వానరా బయ్.. పొట్టుపొట్టు కొట్టిందిపో..!

అమీర్పేట్ మైత్రి వనమా..? సముద్రమా..? ఏం వానరా బయ్.. పొట్టుపొట్టు కొట్టిందిపో..!

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం కుండపోత వాన కురిసింది. ఈ భారీ వర్షాలకు సిటీలోని మెయిన్ రోడ్లు నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

 

అమీర్పేట్ మైత్రివనం జంక్షన్ దగ్గర, మెట్రో స్టేషన్ చుట్టుముట్టూ సముద్రాన్ని తలపించింది. మోకాలి లోతు కాదు.. ఏకంగా నడుముల లోతు వరద నీరు జామ్ అయింది. అమీర్ పేట్ మెట్రో స్టేషన్ దగ్గర వరద నీళ్లు జామ్ అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమీర్ పేట్ చుట్టుపక్కల ఉండే పబ్లిక్ ఈ వీడియోలను చూసి బిత్తరపోయారు.

 

మునుపెన్నడూ లేని విధంగా ఆ స్థాయిలో వరద నీళ్లు నిలిచిపోవడంతో మైత్రివనం జంక్షన్ దగ్గర పరిస్థితి ఆగంఆగంగా ఉంది. మైత్రివనం బస్టాప్ మొత్తం వరద నీటిలో మునిగిపోవడంతో అప్పటి దాకా అక్కడున్న జనం దూకేసి ఆ బిల్డింగ్ వైపు వెళ్లారు. ఇక.. సిటీలోని ఇతర ప్రాంతాల విషయానికొస్తే.. నాంపల్లి స్టేషన్ రోడ్లోని కామత్ హోటల్లోకి వరద నీరు చేరింది. దీంతో.. హోటల్లో లంచ్ చేయడానికి వెళ్లిన కస్టమర్లు అక్కడే చిక్కుకుపోయారు. వర్షం ఆగిపోయాక.. వరద ప్రభావం తగ్గాక కస్టమర్లు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.

 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. భారీగా కురుస్తున్న వర్షానికి రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోండా మార్కెట్, క్లాక్ టవర్, ఎంజీ రోడ్డు, బేగంపేట్, రసూల్ పుర, బోయిన్ పల్లి, తిరుమల గిరి, మారేడు పల్లి, అడ్డగుట్ట, మెట్టు గూడ, సీతాఫల్ మండితో పాటు తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. హైదరాబాద్ సిటీలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు వరద కాలువలుగా మారిపోయాయి.

 

కూకట్ పల్లి అల్విన్ కాలనీ తులసీ నగర్లో రెండు బైక్స్ వరదలో కొట్టుకొచ్చాయి. భారీ వర్గానికి నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి.. విరించి సిగ్నల్ వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంట పాటు అడుగు కూడా వాహనాలు కదలకపోవడంతో వాహనదారులు నరకం చూశారు. పైన వర్షం.. కింద ట్రాఫిక్ జాం.. ఇలా రెండు విధాలుగా వాహనదారులు యాతన పడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment