తిష్టవేసిన ప్రభుత్వ హాస్టల్ సమస్యలు
డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి
సిద్దిపేట నవంబర్ 25 ప్రశ్న ఆయుధం :
జిల్లా వ్యాప్తంగా వున్న ప్రభుత్వ గురుకుల, కెజిబివి,సంక్షేమ హస్టళ్ళు, ఎస్.యం ఎచ్ తదితర హస్టల్ లలో సమస్యలను పరిష్కరించాలని సోమవారం సిద్దిపేట్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నందు రెవెన్యూ అడిషినల్ కలెక్టర్ కి డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి,జిల్లా ఉపాద్యక్షులు భీమ్ శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు తో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ, బిసి,మైనారిటీ తదితర పేద వర్గాలకు చెందిన పిల్లలు చదువుకుంటున్న హస్టల్ లో సమస్యలు తిష్టవేసయన్నారు. హస్టల్ లో, విద్యాలయాలలో కనీస సదుపాయాలు కరువై నరకయాతన పడుతున్నారు.ప్రభుత్వ పర్యవేక్షణ లేకపొవడంతో టిచర్ల,వార్డెన్ , ప్రవెట్ కాంట్రాక్టర్ల లదే ఇష్ఠారాజ్యాంగా మారడంతో పిల్లలు తమ సమస్యల పరిష్కారానికి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి కి నెట్టబడుతున్నారు.వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్,పాముకాటుకు గురవుతున్న పిల్లలు వరస సంఘటనలు చూస్తే అర్థమవుతుందన్నారు. కిటికీలకు దోమతెరలు లేక,బాత్ రూంకు డోర్లు సరిగ్గా లే,ప్రహరి గోడలు లేక పందులు,కుక్కలు,పాములు స్వైరా విహారం చేస్తున్న పరిస్థితి గజ్వేల్ ఎస్టీ హాస్టల్ లో నెలకొందన్నారు. ఇకనైన ప్రభుత్వం నిర్లక్ష్యం, వివక్షను విడనాడి ప్రభుత్వ హస్టల్ లలో వసతులను మెరుగుపరిచి నాణ్యమైన విద్యాబోధన చెయాలన్నారు.ఇక అహరంలో నాణ్యత కరువైనది.పురుగుల అన్నం,కుళ్ళిపొయిన కూరగాయాలు ఆహర పదార్ధాలను అందజెస్తున్నట్లు వరస సంఘటనలు తీరే రుజువైనదన్నారు.ప్రభయత్వ యాంత్రంగం స్పందించి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరారు.