తక్షణమే ఏబిసిడి వర్గీకరణ చేపట్టాలి.

*తక్షణమే ఏబిసిడి వర్గీకరణ చేపట్టాలి.*

* వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుంది

* మాదిగ ఐక్య సంక్షేమ సంఘం(మాస్)జిల్లా అధ్యక్షులు ఇమ్మడి కిరణ్.

హుజురాబాద్ డిసెంబర్ 29 ప్రశ్న ఆయుధం

వర్గీకరణ ద్వారానే మాదిగల కు సామాజిక న్యాయం జరుగుతుందని మాదిగ ఐక్య సంక్షేమ సంఘం (మాస్)జిల్లా అధ్యక్షులు ఇమ్మడి కిరణ్ అన్నారు ఈ సందర్భంగా హుజరాబాద్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద ఏకైక కులంగా ఉన్నప్పటికీ వర్గీకరణ జరగకపోవడం వల్ల ఈ జాతికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికీ రాష్ట్రంలో నిలువ నీడ లేక ఉండేందుకు ఇల్లు లేక గుంట భూమిలేని నిరుపేద కుటుంబాలు ఎక్కడ చూసినా మాదిగ సామాజిక వర్గానికి చెందినవారే ఉండడం అత్యంత బాధాకరం అని భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రయాణిస్తూ మాదిగ ఐక్య సంక్షేమ సంఘం రాజీలేని పోరాటాలు చేస్తుందని వర్గీకరణ జరిగేంతవరకు తమ పోరాటం ఆపేది లేదని గ్రామస్థాయి నుండి వర్గీకరణ పోరాటం ఉదృతం చేస్తామని తెలిపారు కులాన్ని అడ్డుపెట్టుకొని రాజ్యాంగానికి విరుద్ధంగా కొంతమంది ముఠాగా ఏర్పడి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సైతం లెక్కచేయకుండా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అని ఏబిసిడి వర్గీకరణకు అడ్డుపడితే ఉప కులాల అందర్నీ ఐక్యం చేసి పార్టీలకు సంఘాలకు అతీతంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్య సంక్షేమ సంఘం నాయకులు రొంటాల బుచ్చయ్య ,రొంటాల కుమార్ (ఆర్ కే పి) ,కట్కూరి అరవింద్ ,కొమ్ముల విజయ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now