శివ్వంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా అబ్దుల్ అజీజ్ ఏకగ్రీవ ఎన్నిక

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనునిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా నూతన ఎన్నికైన అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ని ఓ ఫంక్షన్ హాల్ లో శివ్వంపేట మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా అబ్దుల్ అజీజ్, ప్రధాన కార్యదర్శిగా గోవిందరాజ్ చారి, గౌరవఅధ్యక్షుల సీనియర్ జర్నలిస్ట్ వెంకటేష్, ఉపాధ్యక్షునిగా బి.నర్సింలు గౌడ్, కార్యదర్శిలు గా ఆర్ నగేష్, కోండ సంపత్ కుమార్ చారి, ఎస్ వేంకటేష్,కోశాధికారిగా షబ్బీర్ ప్రచార కార్యదర్శిగా ఆనంద్, సలహాదారులుగా డి, సంతోష్, కే,సత్యనారాయణ గౌడ్ కార్యవర్గ సభ్యులుగా గణేష్ కుమార్ చారి, ఏం డీ ఖదీర్,బాలు నాయక్వి.పద్మ చారి, రాజిపేట శ్రీకాంత్, పి.సందీప్, ప్రవీణ్ వెంకటేష్,ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now