సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన అబ్దుల్ కలాం వర్దంతిని పురస్కరించుకుని పటాన్ చెరు డిగ్రీ కళాశాల వద్ద గల కలాం విగ్రహానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, రుద్రారం శంకర్, మెట్టు శ్రీధర్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నవ భారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ.. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు సైంటిస్ట్ కలాం అని, ప్రపంచ డిఫెన్స్ రంగంలో భారతదేశం తలెత్తుకినేలా అగ్నిక్షిపనులను అందించిన మేధావి కలాం అని అన్నారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగి తమ లక్ష్య సాధన కోసం పాటు పడాలని మెట్టు శ్రీధర్ కోరారు. ఈ కార్యక్రమంలో వంగరి అశోక్, కిష్టయ్య, బొడ్డుగారి రాములు, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరులో అబ్దుల్ కలాంకు ఘన నివాళులు
Published On: July 27, 2025 6:57 pm