*ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మ!*
*205 పరుగుల లక్ష్యాన్ని18.2 ఓవర్లలోనే చేదించిన సన్ రైజర్స్ హైదరాబాద్*
*హైదరాబాద్:మే 20*
ఐపీఎల్ 2025లో లఖ్‌న వూ సూపర్ జెయింట్స్ జట్టు ప్లే ఆఫ్ ఆశలు ఆవిరయ్యాయి సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది, దీంతో లక్నో పోరాటం కూడా ముగిసింది. ప్లే ఆఫ్ లో మిగిలిన ఒక్క బెర్త్ కోసం రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో LSG బోల్తా పడింది.
సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఓడింది. దీంతో 12 మ్యాచ్‌లు 10 పాయింట్లతో అధికారికంగా పంత్ సేన ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. అటు భారీ ఛేదనలో అభిషేక్ శర్మ (20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 59)తో పాటు రైజర్స్ బ్యాటర్లు కలిసి కట్టుగా కదం తొక్కడంతో వీరికి నాలుగో విజయం దక్కింది.
ముందుగా లఖ్‌నవూ 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. మార్ష్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 65), మార్‌క్రమ్ (38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61) అర్ధసెంచరీ లు సాధింగా, పూరన్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 45) ఆకట్టుకున్నాడు. ఎషాన్‌కు 2 వికెట్లు దక్కాయి.
ఛేదనలో సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 206 రన్స్ చేసి గెలిచింది. క్లాసెన్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 47), ఇషాన్ (28 బంతు ల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35), కమిందు (21 బంతుల్లో 3 ఫోర్లతో 32 రిటైర్డ్ హర్ట్) రాణించారు. దిగ్వేష్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా అభిషేక్ నిలిచాడు.
*లక్నో ఏకనా స్టేడియంలో అభిషేక్ శర్మ విధ్వంసం*
భారీ ఛేదనలో రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఆటను ప్రదర్శించగా, మిగతా బ్యాటర్లంతా సహకారమం దించారు. ఇక హెడ్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన అధర్వ (13) రెండో ఓవర్‌లోనే వెనుదిరిగినా శర్మ మాత్రం జోరు ఆపలేదు. మూడో ఓవర్‌లో 4,6,4తో 17 రన్స్ అందించాడు.
నాలుగో ఓవర్‌లోనూ 4,6 బాదడంతో పవర్‌ప్లేలో స్కోరు 72/1కి చేరింది. ఆ తర్వాత కూడా అభిషేక్ ఎదురుదాడి ఆగలేదు. బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లతో 26 రన్స్ రాబట్ట డంతో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తయ్యింది.
ప్రమాదకరంగా మారిన అభిషేక్ శర్మను దిగ్వేష్ అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు ఇషాన్‌తో 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మార్‌క్రమ్ ఓవర్‌లో 4,6 బాదిన ఇషాన్‌ను దిగ్వేష్ అవుట్ చేశాడు. అయితే క్లాసెన్ చెలరేగి లక్ష్యాన్ని సులువు చేశాడు. కమిందు సహకారం అందిస్తూ 14వ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో ఆకట్టుకున్నాడు.
అయితే రెండు వరుస ఫోర్ల తర్వాత క్లాసెన్‌ను శార్దూల్ అవుట్ చేసినా అప్పటికి సమీకరణం 15 బంతుల్లో 11 పరుగులే కావడంతో రైజర్స్ విజయానికి ఇబ్బంది లేకుండా పోయింది.