అయ్యప్ప స్వామికి దేవాలయంలో నెయ్యితో అభిషేకం
*గజ్వేల్ నియోజకవర్గం ప్రతినిధి, డిసెంబర్ 26,ప్రశ్న ఆయుధం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో గురువారం అయ్యప్ప స్వామికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నెయ్యితో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అయ్యప్పస్వామికి నెయ్యితో అభిషేకం చేయడానికి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పురోహితులు నంద బాల శర్మ, కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య గురుస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీనివాస్ గురు స్వామిలు మాట్లాడుతూ గజ్వేల్ లో కొలువైన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం సాక్షాత్తు శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయం వలె విరాజిల్లుతుందని, ప్రతి సంవత్సరం భక్తులు అయ్యప్ప ఆలయానికి పెద్ద ఎత్తున వస్తూ స్వామివారిని దర్శించు కుంటున్నారని, కోరిన కోరికలు నెరవేర్చే కొంగుబంగారంగా అయ్యప్ప స్వామి ఆలయం విరాజిల్లుతుందని, అభిషేక ప్రియుడు అయ్యప్ప స్వామికి గురువారం వైభవంగా నెయ్యితో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాలేష్ స్వామి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు గంగిశెట్టి రాజు స్వామి, జగ్గయ్యగారి శేఖర్ స్వామి, రవీందర్ స్వామి, దొంతుల సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గంగిశెట్టి వెంకటేష్, ఉమేష్, యాదగిరి, శ్రీనివాస్, సంతోష్, పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.