కుంభమేళాలో 60 కోట్ల మంది పుణ్యస్నానాలు: యోగి
Feb 22, 2025,
కుంభమేళాలో 60 కోట్ల మంది పుణ్యస్నానాలు: యోగి
ఉత్తరప్రదేశ్‌లోని మహా కుంభమేళా వైభవంగా సాగుతోంది. దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలువురు భక్తులు కుంభమేళా చేరుకుంటున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. పవిత్ర త్రివేణి సంగమంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య 60 కోట్ల మంది పుణ్య స్ననాలు ఆచరించారని వెల్లడించారు. మహాకుంభ్ శక్తిని యావత్ ప్రపంచం కీర్తిస్తోందని, మన దేశ, రాష్ట్ర సామర్థ్యం అంటే ఇష్టపడని వారు కుంభమేళాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.