Site icon PRASHNA AYUDHAM

అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

IMG 20241111 WA0178

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
భారతరత్న పురస్కార గ్రహీత, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ 136 వ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన వ్యక్తి, పరిపాలన దక్షకుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అని అన్నారు. 11 ఏళ్లు విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ ఎనలేని సేవలు అందించి, జాతీయ విద్యా విధానం అమలు చేశారన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపు కానీ ఏటా 11వ తేదీన జాతీయ విద్య దినోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మైనార్టీ వర్గాల్లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అగ్రస్థానంలో నిలుస్తారన్నారు. రచయితగా, కవిగా, తత్వవేత్తగా, విద్యావేత్తగా మరియు రాజకీయవేత్తగా అనేక సేవలందించారన్నారు. ఆజాద్ మైనార్టీ అభ్యున్నతికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన,జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సంజీవరావు,జిల్లా అధికారులు, మైనార్టీ సంఘ నాయకులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version