*27 సంవత్సరాలుగా పట్టాలు అందని ఎసి రెడ్డి నగర్ వాసులు:సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి జి.సాంబయ్య*
*జనగామ జిల్లా:*
దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండ్ల పట్టాలకు ఎసి రెడ్డి నగర్ వాసుల నోచుకోలేదని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జనగాం జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల సాంబయ్య అన్నారు.సోమవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పాలకుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో ఏసి రెడ్డి నగర్ కాలనీ నుంచి గుడివాడ చౌరస్తా, రాజీవ్ చౌరస్తా మీదుగా తాహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం ధర్నా నిర్వహించి అధికారులకు మెమోరాండం అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల సాంబయ్య పాల్గొని మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలు 1998లో గుడిసెలు వేసుకొని ఇండ్లు నిర్మాణం చేసుకున్నారని,దాదాపు మూడు దశాబ్దాలు కావస్తున్నప్పటికీ నేటికీ ఇండ్ల పట్టాలు ఇవ్వకపోవడం విచారకరమని,అనేక ఏళ్లుగా పేద ప్రజలు ఇండ్ల పట్టాల కోసం ఎదురు చూశారని,గత పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గుడిసేవాసుల్ని ఉపయోగించుకున్నారని,అనేక పోరాటాల ద్వారా ఇండ్ల నిర్మాణంతోపాటు కాలనీలో సిసి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని,సగం మంది కాలనీవాసులకి 2005లో స్థానిక గ్రామపంచాయతీ ఇంటి నెంబర్లు ఇచ్చారని,మిగతా వారికి ఇవ్వలేదని,మిగతా వారికి ఇంటి నెంబర్లు వేయాలని,కాలనీవాసులందరికీ హక్కు పత్రాలు కల్పించాలని ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు అనంతోజు రజిత, జిల్లా కమిటీ సభ్యులు జీడి సోమయ్య, మండల కార్యదర్శి కొనకటి కలింగరాజు, నాయకులు మహంకాళి శ్రీనివాస్, తూర్పాటి సారయ్య, గాయాల బాబు, ఏసి రెడ్డి నగర్ కాలనీవాసులు, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు శేరు మల్లికాంబ, మామిండ్ల జయమ్మ, శెవ్వ బుచ్చమ్మ, సూరమ్మ, లచ్చమ్మ, ఇందిర, సుజాత, మంజుల, రమ, రజిత, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.