ACB: 15 మంది ప్రభుత్వ ఉద్యోగుల పై కేసులు నమోదు.. సంచలన విషయాలు వెల్లడి

*ACB: 15 మంది ప్రభుత్వ ఉద్యోగుల పై కేసులు నమోదు.. సంచలన విషయాలు వెల్లడి*

అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దాడులలో మార్చి నెలలో 15 కేసులు నమోదు చేసి విచారించినట్లు ఏసీబీ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు

మార్చి నెల వివరాలు వెల్లడిస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. 12 ట్రాప్ కేసులు, 2 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 1 తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో సహా పదిహేను మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పేర్కోన్నారు. ఏసీబీ తనిఖీల్లో రెవెన్యూ, హోం, ఎంఏయుడి, ఇంధనం, విద్య, ఆరోగ్యం, వైద్య, రవాణా, వ్యవసాయం, సహకారం వంటి వివిధ తోటి విభాగాల ట్రాప్ కేసులో రూ.3లక్షల 28వేల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

జనవరి-మార్చి త్రైమాసికంలో 52 కేసులను నమోదు చేసిందని, 37 ట్రాప్ కేసులు, 4 అసమాన ఆస్తుల కేసులు, 4 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 3 రెగ్యులర్ ఎంక్వైరీలు, 1 సర్‌ప్రైజ్ చెక్ , 3 డిస్‌క్రీట్ ఎంక్వైరీలు చేసినట్లు తెలిపారు. 6గురు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుతో పాటు, 55 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. ట్రాప్ కేసుల్లో రూ. 12 లక్షల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వివిధ విభాగాల డీఏ కేసులో రూ.4 కోట్ల 80 లక్షల పైచిలుకు విలువైన ఆస్తులను వెలికి తీసినట్లు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment