మాజీ మంత్రి విడుదల రజని పై ఏసీబీ కేసు నమోదు?

*మాజీ మంత్రి విడుదల రజని పై ఏసీబీ కేసు నమోదు?*

విజయవాడ :మార్చి 23

జగన్‌ పరిపాలన హయాం లో పల్నాడు జిల్లా యడ్ల పాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమాన్యాన్ని విజిలెన్స్‌ తనిఖీల ముసు గులో బెదిరించి వారి నుంచి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని, అప్పటి గుంటూరు ఆర్‌వీఈవో, ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384, 120బీ సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు పెట్టింది.ఏ1గా విడ దల రజిని, ఏ2గా ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా, ఏ3గా విడదల రజిని మరిది విడదల గోపి, ఏ4గా రజిని పీఏ దొడ్డ రామకృష్ణ లను నిందితులుగా చేర్చింది.

ఈ బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు అందింది. ఆ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ హరీష్‌కుమార్‌ గుప్తా విచా రణ జరిపించి, ప్రభుత్వాని కి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు సర్కార్ ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ సింగ్‌ ప్రాథమిక దర్యాప్తు చేయించారు.

ఆధారాలు లభించడంతో శనివారం కేసు నమోదు చేశారు. స్టోన్‌క్రషర్‌పై దాడులు చేయకుండా, మూయించకుండా ఉండాలంటే ఎమ్మెల్యేని కలవాలని హుకుం జారీ చేశారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజిని కార్యాలయానికి వెళ్లి కలిశారు.

తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులివ్వా ల్సిందేనని, మిగతా విష యాలు తన పీఏ రామకృష్ణ తో మాట్లాడాలని రజిని వారితో చెప్పారు. వారిద్ద రూ రామకృష్ణను కలవగా ఆయన రూ.5 కోట్లు డిమాండ్‌ చేశారు.

ఆ తర్వాత ఆరు రోజులకే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్‌ విజి లెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారి – ఆర్‌వీ ఈవోగా ఉన్న ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా భారీ బృందంతో శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌లో తనిఖీలకు వెళ్లి హడావుడి చేశారు.

ఆ స్టోన్‌ క్రషర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే జాషువా విచారణకు వెళ్లారు. అప్పటి విజిలెన్స్‌ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. విజిలెన్స్‌ ప్రధాన కార్యాలయానికి ఈ దాడుల సమాచారమే ఇవ్వలేదు. విచారణలో వెల్లడైన అంశాలతో నివేదిక సిద్ధం చేశారు.

Join WhatsApp

Join Now