*ఏసీబీ రైడ్స్:-*
రంగా రెడ్డి జిల్లా:-
హస్తినాపురం ఊర్మిళ నగర్ లో నివాసముంటున్న డిండి అర్ఐ శ్యామ్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
దిండి మండలం పడమటి తండా కు చెందిన పాండు నాయక్ తన కూతురుకు సంబంధించిన కల్యాణ లక్ష్మి చెక్కు విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు ఆశ్రయించిన పాండు నాయక్..
కల్యాణ లక్ష్మి చెక్కు విషయంలో 10వేల రూపాయలు డిమాండ్ చేసిన శ్యామ్ నాయక్.
మొదటి విడతగా 5 వేల రూపాయలు తీసుకొని రెండోసారి 5వేల రూపాయలు ఇస్తుండగా ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ (అనిశా) అధికారులు…
గతంలో కూడా పీఏపల్లి ఆర్ఐగా పని చేస్తున్న సమయంలో సస్పెండ్ అయినట్టు సమాచారం…
ఫైల్ పై సంతకం పెట్టకుండా రెండు సంవత్సరాలుగా వేధిస్తున్న శ్యాం నాయక్.
ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్న సోదాలు..